Indian Navy: ఇండియన్ నేవీ అలర్ట్.. అరేబియా సముద్రంలో భారీ విన్యాసాలు

by B.Srinivas |

పహెల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Indian Navy: ఇండియన్ నేవీ అలర్ట్.. అరేబియా సముద్రంలో భారీ విన్యాసాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బలగాలు తమ సన్నద్దతను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఐఎన్ఎస్ విక్రాంత్‌ (Ins vikranth)ను ఇప్పటికే అరేబియా సముద్రంలో మోహరించిన ఇండియన్ నేవీ (Indian Navy) తాజాగా అదే సముద్రంలో విన్యాసాలు చేపట్టింది. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. యాంటీ-షిప్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఫైరింగ్ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేయగా ఈ విన్యాసాలు నేవీ పోరాట సంసిద్ధతను ప్రదర్శించడం, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నెల 3వ తేదీ వరకు ఈ కసరత్తులు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. నావికా కార్యకలాపాలతో పాటు, గుజరాత్ తీరంలోని అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దగ్గర ఓడలను సైతం ఇండియన్ నేవీ మోహరించింది. ఈ షిప్‌లు నావికాదళంతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ నిఘాను పెంచడానికి ఉపయోగపడనున్నాయి. అంతేగాక ఈ ప్రాంతంలో ఇటీవల పలుమార్లు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ఇండియన్ నేవీ తన బలాన్ని పెంచుకున్నట్టు తెలుస్తోంది.

Next Story