- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pulitzer Prize: ఇద్దరు భారతీయులకు పులిట్జర్ అవార్డు
ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి వారు రూపొందించిన 'ట్రాప్‌డ్' ప్రాజెక్ట్ ‘ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ’ విభాగంలో ఈ అవార్డును సొంతం చేసుకోనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ నిఘా, సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పును ప్రపంచానికి చూపించడంలో చేసిన కృషికి గానూ భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి వారు రూపొందించిన 'ట్రాప్‌డ్' ప్రాజెక్ట్ ‘ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ’ విభాగంలో ఈ అవార్డును సొంతం చేసుకోనున్నారు. ఒక భారతీయ న్యూరాలజిస్ట్ డిజిటల్ మోసానికి ఎలా బలయ్యాడో చూపిస్తూ, ఈ ప్రాజెక్ట్ కథనం, విజువల్స్‌ను సమర్థవంతంగా చూపించింది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో కొత్తగా పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాల ప్రమాదాన్ని ఇది బహిర్గతం చేసింది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వ్యక్తులను మానసికంగా ఒత్తిడి చేసి, ఆర్థికంగా మోసం చేసే విధానాలను ఇది వివరంగా చూపించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ ముప్పుల నేపథ్యంలో, ఈ రిపోర్ట్ ప్రజల అవగాహనను పెంచడంలో కీలక పాత్ర పోషించింది.






