భారత ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన ప్రత్యేక కాయిన్స్ ఇవే..!

by Dishafeatures2 |
భారత ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన ప్రత్యేక కాయిన్స్ ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతిష్టాత్మక సెంగోల్ (రాజదండం) పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించారు. ఇక మోడీ రూ.75 ల ప్రత్యేక కాయిన్ ను ఆవిష్కరించారు. అయితే ఇప్పటి వరకు పలు ప్రత్యేక సందర్భాల్లో భారత ప్రభుత్వం మొత్తం ఐదు సార్లు ప్రత్యేక కాయిన్స్ ను ఆవిష్కరించింది. 2019లో మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని 150 రూపాయల ప్రత్యేక కాయిన్ ను విడుదల చేశారు. ఈ కాయిన్ కు ఓ వైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉండగా.. మరో వైపు అశోక స్తంభం, సింహం బొమ్మలు ఉన్నాయి.

2010లో మదర్ థెరిసా బర్త్ డే సందర్భంగా భారత ప్రభుత్వం 5 రూపాయల ప్రత్యక కాయిన్ ను రిలీజ్ చేసింది. ఇక మహాత్మా గాంధీ చేపట్టిన దండి మార్చ్ కు 2005లో 75 ఏళ్లు అయిన సందర్భంగా 5 రూపాయల ప్రత్యేక కాయిన్ ను విడుదల చేశారు. 2013లో స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 5 రూపాయల కాయిన్ ను రిలీజ్ చేసింది. తాజాగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా పీఎం మోడీ 75 రూపాయల స్పెషల్ కాయిన్ ను ఆవిష్కరించారు.


Next Story

Most Viewed