ఇరాన్ ప్రయాణాలపై భారత ప్రభుత్వం హెచ్చరిక.. ట్రావెల్ అడ్వైజరీ జారీ

by Kema Shiva Kumar |

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులు ఇరాన్‌కు వెళ్లవద్దని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది.

ఇరాన్ ప్రయాణాలపై భారత ప్రభుత్వం హెచ్చరిక.. ట్రావెల్ అడ్వైజరీ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (Western Asia)లో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్‌ (Iran)లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేస్తూ ట్రావెల్ అడ్వైజరీ (Travel Advisory) విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత పౌరులెవరూ ఇరాన్‌కు ప్రయాణించవద్దని హెచ్చరించింది. గాలి, భూమార్గం.. ఏ విధంగానూ ప్రస్తుతం ఇరాన్‌కు ప్రయాణించవద్దని భారతీయులను రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత్-ఇరాన్ మధ్య కొన్ని విమాన సర్వీసులు ప్రారంభమైనట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ, పాత అడ్వైజరీలనే కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల గగనతల ఆంక్షలు (Airspace restrictions) కొనసాగుతున్నాయని, దీంతో అంతర్జాతీయ విమాన రాకపోకల్లో అనిశ్చితి నెలకొందని భారత ఎంబసీ పేర్కొంది.

వెంటనే ఆ దేశం విడిచి రావాలి..

ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని సూచించింది. ఇందుకోసం నిర్ణీత భూ సరిహద్దు మార్గాలను (Land border routes) ఉపయోగించుకోవాలని, అయితే ఈ ప్రక్రియ అంతా భారత రాయబార కార్యాలయం సమన్వయంతోనే జరగాలని స్పష్టం చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు ఏవైనా అత్యవసర పరిస్థితులు, మార్గదర్శకాల కోసం +989128109115, +989128109109, +989128109102, +989128109179359 ఈ మొబైల్ నంబర్లకు సంప్రదించాలని, లేని పక్షంలో [email protected] ఈమెయిల్ పంపాలని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

Next Story