వాణిజ్యం చర్చే జరగలేదా? ట్రంప్ అబద్ధం చెప్పాడా?

by Phanindra |

భారత్, పాక్‌తో వాణిజ్యం చేస్తామని చెప్పి యుద్ధం ఆపించానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే అసలు ఈ చర్చే జరగలేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

వాణిజ్యం చర్చే జరగలేదా? ట్రంప్ అబద్ధం చెప్పాడా?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య తనే మధ్యవర్తిత్వం చేశానని, కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. యుద్ధం ఆపేస్తే భారీ వాణిజ్యం ఒప్పందాలు చేసుకుంటానని చెప్పడంతోనే కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ చెప్పారు. అయితే అసలు ఇలాంటి చర్చలే యూఎస్, భారత్ మధ్య జరగలేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య జరిగిన సంభాషణలోకానీ, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియోతో జైశంకర్ చేసిన సంభాషణలోకానీ ఎక్కడా అసలు వాణిజ్యం ఊసేరాలేదని సమాచారం.

మే 9వ తేదీన మోడీకి వాన్స్ కాల్ చేశారు. ఆ మరుసటి రోజే జైశంకర్, ఎన్‌ఎస్‌జీ దోవల్‌కు రుబియో ఫోన్ చేశారట. అయితే ఈ మూడు కాల్స్‌లో ఏ సందర్భంలోనూ వాణిజ్యం అంశమే రాలేదని, పాక్ దాడులు చెయ్యకపోతే తమకు ఎదురుదాడులు చెయ్యాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఇలా గొప్పలు చెప్పుకోవడం, క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నించడం మామూలేనని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.

Next Story