పాకిస్థాన్‌కు యుద్దనౌకల సమాచారం.. థానేలో ఇంజినీర్ అరెస్ట్

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న కేటుగాళ్లను ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పాకిస్థాన్‌కు యుద్దనౌకల సమాచారం.. థానేలో ఇంజినీర్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న కేటుగాళ్లను ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా తాజాగా థానేకు చెందిన రవీంద్ర వర్మ అనే మెకానికల్ ఇంజినీర్‌ను సైతం పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడని అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర వర్మను 2024లో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే ఇద్దరు పాక్ ఏజెంట్లు ఫేస్ బుక్ ద్వారా హనీట్రాప్ చేశారు. భారత ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న పాక్ ఏజెంట్లు రవీంద్ర వర్మతో పరిచయం పెంచుకున్నారు. ఆ తరవాత ఓ ప్రాజెక్టు కోసం యుద్ధ నౌకల సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇంజనీర్ భారత్‌కు చెందిన యుద్ధనైకలు, సబ్ మెరైన్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు ఇచ్చాడు. వాళ్లు పాకిస్థాన్ ఏజెంట్లు అని తెలిసిన తరవాత కూడా రవీంద్ర వర్మ సమాచారాన్ని చేరవేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అతడి ఖాతాలో భారీగా డబ్బు జమచేసినట్టు గుర్తించారు. రవీంద్ర వర్మ ఓ రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ముంబాయిలోని నావల్ డాక్ యార్డుకు వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ ఫోన్లకు అనుమతి లేకపోవడంతో వర్మ స్కెచ్ వేసి ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు పంపించాడు. ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వర్మను కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

Next Story