- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత ఆర్థిక వ్యవస్థ ‘బుల్లెట్’ వేగం.. 7.4 శాతం వృద్ధి దిశగా పయనం
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం.. దేశ వాస్తవ జీడీపీ (Real GDP) వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కానుంది.

దిశ, వెబ్ డెస్క్: సేవా రంగం జోరు - జీడీపీలో సరికొత్త ఊపు భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) వృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం.. దేశ వాస్తవ జీడీపీ (Real GDP) వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కానుంది. గత ఏడాది (2024-25) ఇది 6.5 శాతంగా ఉండగా, ఈసారి దాదాపు ఒక శాతం మేర వృద్ధి పెరగడం విశేషం. ఈ వేగానికి ప్రధాన ఇంధనం 'సేవా రంగం' (Services Sector) అని చెప్పవచ్చు. సేవా రంగం అద్భుతమైన పనితీరు కనబరుస్తుండటంతో, స్థూల విలువ జోడింపు (GVA) వృద్ధి రేటు కూడా 7.3 శాతంగా నమోదవుతుందని గణాంకాలు చెబుతున్నాయి.
రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాలు టాప్.. వ్యవసాయం డల్
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాల్లో రంగాల వారీగా చూస్తే.. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఏకంగా 9.9 శాతం వృద్ధితో టాప్ గేర్‌లో ఉన్నాయి. తయారీ (Manufacturing) నిర్మాణ రంగాలు 7.0 శాతంతో పటిష్టంగా ఉండగా, వాణిజ్యం, హోటల్స్, రవాణా రంగాలు 7.5 శాతం వృద్ధిని కనబరుస్తున్నాయి. అయితే, వ్యవసాయ రంగం మాత్రం 3.1 శాతం వృద్ధితో కాస్త నెమ్మదించింది. ఇక దేశంలో ప్రైవేట్ వినియోగం (Private Consumption) 7.0 శాతానికి, పెట్టుబడులు (Capital Formation) 7.8 శాతానికి పెరగడం భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి శుభసూచకంగా నిలుస్తోంది. ఈ అంచనా జీడీపీ సాధ్యం అయితే భారత్ పెట్టుకున్న లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.






