- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలిఫోర్నియా నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసిన భారతీయ డ్రైవర్లు
కాలిఫోర్నియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లు, ముఖ్యంగా సిఖ్ కమ్యూనిటీకి చెందిన డ్రైవర్ల రాష్ట్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటర్ వెహికల్స్ (DMV) తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

దిశ, వెబ్ డెస్క్ : కాలిఫోర్నియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లు, ముఖ్యంగా సిఖ్ కమ్యూనిటీకి చెందిన డ్రైవర్ల రాష్ట్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటర్ వెహికల్స్ (DMV) తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. DMV నవంబర్ 2025లో సుమారు 20,000కు పైగా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను (CDL) రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది. వాటిని జనవరి 5, 2026 నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో వేలాది మంది డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఫెడరల్ మోటర్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (FMCSA) నిబంధనల ప్రకారం నాన్-డామిసైల్డ్ CDL హోల్డర్లు కావడం, చిరునామా, పేరు వంటి చిన్న క్లరికల్ పొరపాట్లు, లైసెన్స్ గడువు ముగిసిందన్న కారణాలతో ఈ చర్య తీసుకున్నామని DMV చెబుతోంది.
మరోవైపు సిఖ్ కోలిషన్, ఆసియన్ లా కాకస్ వంటి పౌర హక్కుల సంఘాలు ఇవన్నీ DMV తప్పుల వల్లే జరిగాయని, సరిచేసి లైసెన్స్‌లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న DMVతోపాటు DMV డైరెక్టర్ స్టీవ్ గోర్డన్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. DMV తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని, దాదాపు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వాదిస్తూ జనవరి 5 నుంచి అమలయ్యే DMV రద్దును నిలిపివేయాలని కోరారు. కాలిఫోర్నియా ప్రభుత్వం కొంతమంది లైసెన్స్‌లను తిరిగి జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఈ అంశంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.






