Cricketer Shami's Wife Hasin Jahan: దేశం పేరును మార్చండి.. షమీ భార్య హసిన్ జహన్

by Hamsa |
Indian Cricketer Shamis Wife Hasin Jahan Urges PM Modi to Change Country Name
X

దిశ, వెబ్‌డెస్క్: Indian Cricketer Shami's Wife Hasin Jahan Urges PM Modi to Change Country Name| ఈ రోజు దేశమంతటా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్ షమీ సతీమణి హసిన జహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకొని ఓ వీడియోను షేర్ చేస్తూ '' అందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకీ జై.. మన దేశం మనకు గర్వ కారణం. నేను భారత్‌ను ప్రేమిస్తున్నాను. మనదేశం పేరు 'భారత్' అని లేదా 'హిందూస్తాన్' అని గానీ ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి.

ప్రస్తుతం మనం పిలుస్తున్న ' ఇండియా' పేరును మార్చి 'భారత్' అని పెట్టండి. అప్పుడు ప్రపంచం మొత్తం అదే పేరుతో పిలుస్తుంది'' అంటూ రాసుకొచ్చింది. అది చూసిన నెటిజన్లు కొంత మంది ఈ టైమ్‌లో అవసరమా? అని వ్యతిరేకిస్తుంటే మరికొంతమంది మాత్రం కరెక్ట్ మేడమ్ అంటూ ఆమెను సమర్దిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అంతటి ప్రశాంతత ఉంటుందంటూ.. క్రికెటర్‌పై ప్రధాని ప్రశంసల వర్షం

Next Story