వరదల్లో ప్రయాణించే స్పెషల్ వెహికల్స్! సహాయక చర్యల్లో ATOR N1200 వాహనాలు.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ

by Ramesh Naini |   (  Updated:2025-08-28 10:25:43  IST  )

గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రభావిత ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.

వరదల్లో ప్రయాణించే స్పెషల్ వెహికల్స్! సహాయక చర్యల్లో ATOR N1200 వాహనాలు.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర భారత దేశంలో (Heavy rains) భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రభావిత ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. చాలా గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయ. వరదల కారణంగా రాకపోకలు నిలిచాయి. అలాగే (Punjab) పంజాబ్‌లో వరదల కారణంగా అనేక జిల్లాల్లో విపత్తు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే అమృత్‌సర్‌లోని వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా భారత సైన్యం (Indian Army) రంగంలోకి దిగింది. ఈ మేరకు వరద నీటిలో ప్రయాణించే స్పెషల్ వెహికల్స్‌ను సహాయక చర్యల (rescue operation) కోసం ఉపయోగిస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం ఏటీఓఆర్ ఎన్1200 స్పెషలిస్ట్ మొబిలిటీ వెహికల్ ‌(ATOR N1200 Specialist Mobility Vehicle (SMV)ను ఉపయోగించారు. ఈ వాహనం నేలపై, బురద, వరద ప్రాంతాల్లో సులువుగా ప్రయాణించగలదని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వెహికల్ లుక్‌, వరద నీటిలో చాలా సులువుగా ప్రయణించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ గొప్పతనం పై కామెంట్ల రూపంలో చర్చించారు. కాగా, పంజాబ్‌లో అనేక జిల్లాలు వరద ప్రభావం ఉంది. పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, కపుర్తలా, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్, జలంధర్, రూప్‌నగర్, తర్న్ తరణ్, సంగ్రూర్, మాన్సా, బతిండా, లూధియానాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story