‘ప్రపంచపటంలో ఉంటారో లేదో నిర్ణయించుకోండి’.. పాక్‌కు భారత్ లాస్ట్ వార్నింగ్

by Gantepaka Srikanth |

భారత్‌పై ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగుదేశం పాకిస్తాన్‌కు భారత సైన్యాధిపతి(ఆర్మీ చీఫ్) ఉపేంద్ర ద్వివేది అత్యంత కఠినమైన భాషలో హెచ్చరికలు జారీ చేశారు.

‘ప్రపంచపటంలో ఉంటారో లేదో నిర్ణయించుకోండి’.. పాక్‌కు భారత్ లాస్ట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌పై ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగుదేశం పాకిస్తాన్‌కు భారత సైన్యాధిపతి(ఆర్మీ చీఫ్) ఉపేంద్ర ద్వివేది అత్యంత కఠినమైన భాషలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ గనుక భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ఆపకపోతే.. మొత్తం పాకిస్తాన్ ప్రపంచపటం నుంచి మాయం కావడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ వంటి పరిస్థితులు మళ్లీ ఎదురైతే భారత సైన్యం ఎలా స్పందిస్తుందని అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు.

ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన..

గతేడాది మే 7వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టారు. దీనికి ఆపరేషన్ సిందూర్ అనే పేరు పెట్టారు. ఈ చారిత్రాత్మక సైనిక చర్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, గతేడాది మే నెలలో ఇరు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు ఉత్కంఠభరితంగా సైనిక ఘర్షణ జరిగింది. పాకిస్తాన్ భారత్‌పై ఎదురుదాడికి దిగగా, భారత్ కూడా ఆపరేషన్ సిందూర్ కింద అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది. చివరకు మే 10వ తేదీన సాయంత్రం ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత ఈ ఘర్షణలు ముగిశాయి.

Next Story