- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేషెంట్లకు నిషేదిత ట్యాబ్లెట్స్.. డాక్టర్‌కు 130ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలో భారత సంతతికి చెందిన డాక్టర్‌కు 130ఏళ్ల జైలుశిక్ష పడింది. పెన్సుల్వేనియాకు చెందిన ఆనంద్ అనే డాక్టర్ మెడికేర్‌కు తప్పుడు పత్రాలు

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన డాక్టర్‌కు 130ఏళ్ల జైలుశిక్ష పడింది. పెన్సుల్వేనియాకు చెందిన ఆనంద్ అనే డాక్టర్ మెడికేర్‌కు తప్పుడు పత్రాలు సమర్పించారని, పేషెంట్లకు నిషేదిత ట్యాబ్లెట్స్ ఇచ్చారని అభియోగాలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన యూఎస్ ప్రత్యేక న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. 2.3 మిలియన్ డాలర్ల డ్రగ్స్ స్కామ్ జరిగినట్టు గుర్తించింది. డాక్టర్ పేషెంట్లకు 20 ఏళ్లకు పైగా ఆక్సికోడోన్ లాంటి అడిక్టివ్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేసినట్టు రుజువు అయినట్టు పేర్కొంది.
డాక్టర్ ఆనంద్ బ్లాంక్ ప్రిస్క్రిప్షన్ లపై సంతకం చేస్తే అర్హత లేకున్నా జూనియర్ డాక్టర్లు మందులు రాసినట్టు తేలింది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ 2022లో లక్షకు పైగా ప్రజలు మందుల ఓవర్ డోస్ వళ్ల మరణించినట్టు నిర్థారించింది. అందులో 80వేల మంది నిషేదిత డ్రగ్స్ కు అలవాటు పడినట్టు గుర్తించింది. దీనిపై విచారణ జరగ్గా ఆనంద్ కు సంబంధించిన ఫార్మసీలలో ఎక్కువగా నిషేదిత డ్రగ్స్ అమ్మినట్టు తేలింది. ఈ కేసులో విచారణ జరుగుతున్న సమయంలోనూ ఆనంద్ తన ఖాతాలో ఉన్న డబ్బును తండ్రి ఖాతాలోకి బదిలీ చేసినట్టు గుర్తించారు. ఇలా వరుస తప్పులకు పాల్పడిన డాక్టర్ కేసును తీవ్రంగా పరిగనిస్తూ యూఎస్ ప్రత్యేక న్యాయస్థానం 130ఏళ్ల జైలు శిక్ష విధించింది.






