త్వరలో మలేరియా విముక్త భారత్ : అమిత్ షా

by Muthe.Rajitha |

త్వరలోనే భారత్ నుంచి మలేరియాను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.

త్వరలో మలేరియా విముక్త భారత్ : అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్ : త్వరలోనే భారత్ నుంచి మలేరియాను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నేడు అహ్మదాబాద్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్వహించిన ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్‌ (IMA NATCON 2025)లో పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో మలేరియా కేసులు 97 శాతం తగ్గాయని, అతి త్వరలో దేశం నుంచి పూర్తిగా మలేరియాను తరిమేస్తామని అన్నారు. ఆయుష్మాన్ భారత్‌, మిషన్ ఇంద్రధనుష్‌ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన చెప్పారు. వికసిత్ భారత్‌–2047 లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరమని, అందుకు డాక్టర్లు ప్రభుత్వ పథకాలతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు.

భారత్‌ ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అమిత్ షా కొనియాడారు. గత ఐదేళ్లలోనే డెంగ్యూ మరణాల రేటును 1 శాతానికి, ప్రసూతి మరణాల సంఖ్య 25 శాతం తగ్గిందని వెల్లడించారు. 2014లో రూ.37 వేల కోట్లుగా ఉన్న కేంద్ర ఆరోగ్య బడ్జెట్‌ ఇప్పుడు రూ.1.28 లక్షల కోట్లకు పెరగడమేనని ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు.

Next Story