IMD: మార్చి నెలలో నిప్పులు చెరగనున్న సూర్యుడు

by Shamantha N |

ఈ ఏడాది మార్చిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ వెల్లడించారు.

IMD: మార్చి నెలలో నిప్పులు చెరగనున్న సూర్యుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది మార్చిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ వెల్లడించారు. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఉష్ణోగ్రత మార్పుల వల్ల గోధుమ, శనగ వంటి పంటలకు ముప్పు కలిగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఫిబ్రవరిలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు..

దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. 22 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. మొదటిసారిగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరిగా ఈ ఏడాది మారింది.

Next Story