మెక్సికో సుంకాలకు ప్రతిస్పందిస్తాం: భారత్

by Phanindra |

భారత్‌పై మెక్సికో వేసిన 50 శాతం సుంకాలకు ప్రతిస్పందిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటికే చర్చలు మొదలైనట్లు వెల్లడించారు.

మెక్సికో సుంకాలకు ప్రతిస్పందిస్తాం: భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై మెక్సికో 50 శాతం సుంకాలు వేయడంపై ఢిల్లీ వర్గాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఈ విషయంలో మెక్సికోపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. భారతీయ ఎగుమతిదారుల రక్షణ కోసం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని, అదే సమయంలో చర్చలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని వాళ్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో మెక్సికోతో వాణిజ్య శాఖ చర్చలు కొనసాగుతున్నాయని, ఇరుదేశాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. కామర్స్ సెక్రెటరీ రాజేష్ అగర్వాల్, మెక్సికో ఆర్థికశాఖ వైస్ మినిస్టర్ లూయిస్ రోసెండో మధ్య ఇప్పటికే భేటీ జరిగిందని, త్వరలో ఫాలో అప్ మీటింగ్‌లు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు.

Next Story