సరిహద్దుల్లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను భారత్ దెబ్బతీస్తుంది: Rajnath Singh

by Malleboina Mahesh |   (  Updated:2023-06-27 08:33:37  IST  )

భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూలో పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే సరిహద్దులో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను భారత్ దెబ్బతీస్తుందని అన్నారు.

సరిహద్దుల్లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను భారత్ దెబ్బతీస్తుంది: Rajnath Singh
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూలో పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే సరిహద్దులో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను భారత్ దెబ్బతీస్తుందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని కేవలం 10 నిమిషాల సమయం తీసుకున్నారని, ఇది ఆయన దృఢ సంకల్ప శక్తిని తెలియజేస్తోందని ఆయన అన్నారు. భారత్ చర్యల వల్ల ఉగ్రవాదాన్ని సహించరాదనే విషయాన్ని ప్రపంచానికి అర్థమైందని, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రతి దేశం భారత్ నే అనుసరిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.

Next Story