Musk: భారత్-అమెరికా మధ్య సంబంధాల కోసం మద్దతిస్తా- మస్క్

by Shamantha N |

భారత్‌, అమెరికా (India-US)ల మధ్య సంబంధాలపై బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు.

Musk: భారత్-అమెరికా మధ్య సంబంధాల కోసం మద్దతిస్తా- మస్క్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌, అమెరికా (India-US)ల మధ్య సంబంధాలపై బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సానుకూల ధోరణిలో ఉన్నాయని అన్నారు. స్పేస్‌ఎక్స్‌ స్టార్‌బేస్‌ స్థావరంలో భారత్‌కు చెందిన వ్యాపారవేత్తలతో మస్క్‌ సమావేశమయ్యారు. ఇందులోభాగంగా మాట్లాడుతూ భారత్, అమెరికాల మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాల కోసం ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందన్నారు. ఇరుదేశాల మధ్య సాంకేతికత, అంతరిక్ష అన్వేషణ రంగాలలో సహకారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ పాత్ర మెరుగవుతోందని అన్నారు. మరోవైపు, ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) నేతృత్వంలోని భారతీయ పారిశ్రామికవేత్తలు, స్పేస్‌ ఎక్స్‌(SpaceX) అత్యాధునిక అంతరిక్ష పరిశోధన సౌకర్యాలను సందర్శించారు. అంతేకాకుండా, స్టార్‌షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని వీక్షించారు. సాంకేతికతతో నడిచే సుస్థిరమైన భవిష్యత్తును రూపొందించడంలో భారత్‌కు ప్రపంచ దేశాలు సహకారం అందిస్తున్నాయని.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలబడే రోజు త్వరలోనే వస్తుందని ఇండియా గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా పేర్కొన్నారు.

Next Story