మెరిట్ ఆధారంగా స్టూడెంట్ వీసాలు ఇవ్వాలి.. యూఎస్‌కు భారత్ డిమాండ్

by Phanindra |

మెరిట్ ఆధారంగా స్టూడెంట్ వీసాలు ఇవ్వాలని యూఎస్‌ను భారత్ డిమాండ్ చేసింది. సోషల్ మీడియా పరిశీలన తర్వాతే వీసాలు ఇస్తామని యూఎస్ చెప్పిన సంగతి తెలిసిందే.

మెరిట్ ఆధారంగా స్టూడెంట్ వీసాలు ఇవ్వాలి.. యూఎస్‌కు భారత్ డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థి వీసాలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని యూఎస్‌ను కోరుతున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. యూఎస్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియాలో అమెరికాపై అభిప్రాయాలను పరిశీలించిన తర్వాతే వీసాలు మంజూరు చేయాలని ఇటీవలే ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్త వీసాల కోసం ఇంటర్వ్యూలు చేయొద్దని కాన్సులర్ ఆఫీసులకు ఆదేశాలందినట్లు సమాచారం. దీంతో అమెరికాలో చదువుకునేందుకు వెళ్లాల్సిన భారతీయ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలపై స్పందించిన జైశ్వాల్.. ‘మేం పరిస్థితిని గమనిస్తున్నాం. వీసా మంజూరు చేయడం అనేది ఆ దేశ సార్వభౌమాధికారం. నిర్ణయం వారిదే. కానీ విద్యార్థులకు అందజేసే వీసాలను మెరిట్ ఆధారంగా గడువులోగా అందజేయాలని కోరుతున్నాం’ అని చెప్పారు.


Next Story