- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IMD: ఈ ఏడాది వానలే వానలు
దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) వ్యవసాయం రంగం వాటా 18 శాతం ఉన్నందున.. ఇది రైతులకు శుభవార్త అని నిపుణులు అంటున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) వ్యవసాయం రంగం వాటా 18 శాతం ఉన్నందున.. ఇది రైతులకు శుభవార్త అని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా, భారత జనాభాలో 42 శాతం కంటే ఎక్కువ మంది జీవనోపాధి సాగుపైనే ఉంది. ‘‘జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుంది’’ అని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మెహపాత్ర వెల్లడించారు. దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతానికి దోహదపడే ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళ తీరం దాటనున్న రుతుపవనాలు..
రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళలో తీరం దాటుతాయి. సెప్టెంబర్ మధ్యలో తిరోగమనం చెందుతాయి. వర్షాకాలం రోజుల సంఖ్య తగ్గుతోందని.. భారీ వర్షాలు (స్వల్ప వ్యవధిలో ఎక్కువ వర్షాలు) పెరుగుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు.. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఇటీవల తన నివేదికను విడుదల చేసింది. రాబోయే ‘నైరుతి’ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మార్చి వరకు వాతావరణ పరిస్థితులు, పలు అంశాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయని పేర్కొంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.






