పాక్‌పై ప్రపంచ బ్యాంకు, ఎఫ్ఏటీఎఫ్‌తో భారత్ చర్చలు?

by Phanindra |

ప్రపంచ బ్యాంకు, ఎఫ్ఏటీఎఫ్‌తో భారత్ చర్చలు జరపనుందట. పాకిస్తాన్‌కు అందించే సహకారంపై పునరాలోచించాలని డిమాండ్ చేయనుందట.

పాక్‌పై ప్రపంచ బ్యాంకు, ఎఫ్ఏటీఎఫ్‌తో భారత్ చర్చలు?
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌కు జూన్ నెలలో 20 బిలియన్ డాలర్లు అప్పు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నిర్ణయమాన్ని పునరాలోచించాలని భారత్ కోరనుందట. అలాగే ఉగ్రవాదానికి ఆదాయం అందించే అంశాలను పరిశీలించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)తో కూడా పాక్ గురించి భారత్ చర్చించనుందట. గతంలో పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్టు’లో పెట్టింది. అయితే 2022లో తాము ఉగ్రవాదానికి వెళ్లే నిధులను అడ్డుకున్నామని, అరెస్టయిన పలువురు టెర్రరిస్టుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని పాక్ చెప్పడంలో ఆ దేశాన్ని ‘గ్రే లిస్టు’ నుంచి తొలగించింది. ఈ క్రమంలోనే ఎఫ్ఏటీఎఫ్‌తో మాట్లాడి మరోసారి పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్టు’లో పెట్టాలని భారత్ కోరనుంది.


దీని వల్ల ఆ దేశానికి దక్కే ఆర్థిక సహకారం, విదేశీ పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం పడనుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ దాయాది దేశానికి ఐఎంఎఫ్ ఏకంగా బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ అందించడం పట్ల భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యుద్ధం తలెత్తే పరిస్థితుల్లో ఇలా నిధులు ఎలా ఇస్తారని భారత్ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు, ఎఫ్ఏటీఎప్‌తో మాట్లాడి పాక్ ఉగ్రసంబంధాలను ఎండగట్టి, ఆ దేశానికి నిధులు అందకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Next Story