- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో 2 ఎన్ఎమ్ చిప్స్ తయారీ: కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్
2 ఎన్ఎమ్ చిప్స్ తయారీపై భారత్ ఫోకస్ పెట్టిందని, ఇది ప్రపంచంలోనే అత్యాధునిక చిప్ అని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత డిజిటల్ ప్రయాణం కొత్త పుంతలు తొక్కుతోందని, త్వరలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 2 ఎన్ఎమ్ (నానో మీటర్లు) సెమీకండక్టర్ చిప్స్‌ను ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశ పెడతామని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ‘డేటానే కొత్త ఆయిల్’ అని ఆయన అన్నారు. డేటా సెంటర్లే ఆయిల్ రిఫైనరీల వంటివని, ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ భారత్‌లో కూడా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకొని, దేశంలో నైపుణ్యం ఉన్న యువతకు ఇక్కడే అవకాశాలు లభించేలా చూసుకోవాలన్నారు.
ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో సెమీకండక్టర్ చిప్స్‌ను భారత్ తయారు చేస్తోందని చెప్పారు. ‘దేశంలో అద్భుతమైన నైపుణ్యాలున్న ట్యాలెంట్ బేస్ ఉంది. ఇది మనకు ప్రత్యేకమైన బలాన్ని అందిస్తోంది. ప్రపంచంలోని 20 శాతం గ్లోబల్ డిజైన్ ఇంజినీర్లు భారత్‌లోనే ఉన్నారు. ఇప్పుడు మనం అత్యాధునిక 2 ఎన్ఎమ్ (నానో మీటర్స్) టెక్నాలజీని తయారు చేస్తున్నాం. గతంలో ఇది 5 ఎన్ఎమ్, 7 ఎన్ఎమ్‌గా ఉండేది’ అని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చేస్తోన్న 2 ఎన్ఎమ్ చిప్స్ చాలా సంక్లిష్టమైనవని, మిగతా వాటితో పోలిస్తే చాలా చిన్నగా ఉంటాయని చెప్పారు. అలాంటి అత్యాధునిక చిప్స్‌ను భారత్‌లో తయారు చేస్తున్నామని తెలియజేశారు.






