- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమ్ ఇండియా
మహిళల జట్టు ఆసీస్ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న ఈ పర్యటన ప్రారంభమై మార్చి 9న ముగియనుంది.

- అక్టోబర్, నవంబర్‌లో సిరీస్
- 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్న పురుషుల టీమ్
- ఒక టెస్టుతో పాటు వన్డే, టీ20లు ఆడనున్న మహిళల టీమ్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పురుషుల, మహిళల జట్లు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. భారత పురుషుల జట్టు ఈ పర్యటనలో మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ మొత్తం 8 మ్యాచ్‌లు కూడా ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆడనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన నవంబర్ 8న ముగుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు టీ20 క్రికెట్ మీద ఫోకస్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఇండియా, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ జట్టు సాధ్యమైనంత ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలని నిర్ణయించింది. ఇక మహిళల జట్టు ఆసీస్ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న ఈ పర్యటన ప్రారంభమై మార్చి 9న ముగియనుంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో ఒక టెస్టు జరగనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
షెడ్యూల్:
పురుషుల టీమ్
వన్డేలు
1. అక్టోబర్ 19 - పెర్త్
2. అక్టోబర్ 23 - అడిలైడ్
3. అక్టోబర్ 25 - సిడ్నీ
టీ20లు
1. అక్టోబర్ 29 - కాన్‌బెర్రా
2. అక్టోబర్ 31 - మెల్‌బోర్న్
3. నవంబర్ 2 - హోబాట్
4. నవంబర్ 6 - గోల్డ్‌కోస్ట్
5. నవంబర్ 8 - బ్రిస్బేన్
మహిళల టీమ్
టీ20లు
1. ఫిబ్రవరి 15 - సిడ్నీ
2. ఫిబ్రవరి 19 - మనుకా ఓవల్
3. ఫిబ్రవరి 21 - అడిలైడ్ ఓవల్
వన్డేలు
1. ఫిబ్రవరి 24 - అలెన్ బోర్డర్ ఫిల్డ్, బ్రిస్బేన్
2. ఫిబ్రవరి 27 - హోబాట్
3. మార్చి 1 - సిటీ పవర్ సెంటర్, మెల్‌బోర్న్
టెస్టు
1. మార్చి 6-9 - వాకా గ్రౌండ్, పెర్త్






