ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుంది : ప్రధాని మోదీ

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తారిఖ్ రహ్మాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసామ్య ప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుందన్నారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుంది : ప్రధాని మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP)భారీ విజయం సాధించింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా తారిక్ రెహ్మాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

"ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్‌పీకి నిర్ణాయక విజయం సాధించేలా నాయకత్వం వహించినందుకు తారిఖ్ రెహ్మాన్ కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ ఫలితం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతిబింబం. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్‌కు భారతదేశం తన మద్దతును నిరంతరం కొనసాగిస్తుంది. మన బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను." అని పోస్టులో పేర్కొన్నారు.

Next Story