- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Draupadi Murmu: 'మేక్ ఇన్ ఇండియా'లో భాగం కావాలని స్లొవేకియా కంపెనీలకు రాష్ట్రపతి ముర్ము ఆహ్వానం
స్లొవేకియా ఆర్థిక ప్రగతిలో భారత్ విలువైన భాగస్వామి కాగలదనే నమ్మకం తనకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: స్లొవేకియా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ దేశంలోని కంపెనీలను 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. పోర్చుగల్, స్లొవేకియా దేశాల పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము స్లొవేకియాను సందర్శించారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా వృద్ధిని కొనసాగిస్తోందని, అందులో భాగం కావాలన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్లొవేకియా-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో మాట్లాడిన ముర్ము.. 'స్లొవేకియా తన శ్రామికశక్తి అవసరాల కోసం విదేశాల నుంచి కష్టపడి పనిచేసే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం అన్వేషిస్తోంది. ఈ సందర్భంగా స్లొవేకియా ఆర్థిక ప్రగతిలో భారత్ విలువైన భాగస్వామి కాగలదనే నమ్మకం తనకుంది. రానున్న సంవత్సరాల్లో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదుగుతుందనే విశ్వాసం ఉంది. ఇలాంటి తరుణంలో స్లొవేకియా లాంటి సన్నిహిత దేశాల భాగస్వామ్యం ముఖ్యం. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా ఉంది. స్లొవేకియా యూరప్‌లోనే పటిష్టమైన పారిశ్రామిక స్థావరాన్ని కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య, పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని' ఆమె అన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితంగా ఉన్న సమయంలో భారత్ స్థిరమైన రాజకీయ వాతావరణం, సంస్కరణలతో కూడిన ఆర్థిక ఎజెండా ద్వారా పురోగమిస్తోంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ని ప్రోత్సహిస్తోందన్నారు. దీన్ని ఒక అవకాశంగా ఎంచుకుని 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో చేరేందుకు స్లొవేకియా కంపెనీలను ఆహ్వానించారు. అనంతరం స్లొవేకియాలోని భారత లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫెలిసిటీని ముర్ము సందర్శించారు. అక్కడి భారతీయ సిబ్బందిని కలుకున్నారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు ఆవిష్కరణను వీక్షించారు. ఇదే సమయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. స్లొవాక్ రిపబ్లిక్‌ను సందర్శించిన రెండో భారత దేశాధినేతగా నిలిచారు. 29 ఏళ్ల క్రితం చివరిసారిగా భారత రాష్ట్రపతి స్లోవేకియాను సందర్శించారు.






