- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత విదేశీ బంధాలు వేటికవే ప్రత్యేకం: కేంద్రం
భారత విదేశీ బంధాలు వేటికవే ప్రత్యేకమని, వాటిని మూడో దేశపు కోణంలో చూడకూడదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇతర దేశాలతో భారత బంధాలు వేటికవే ప్రత్యేకమైనవని, వాటిని మూడో దేశం కోణం నుంచి చూడటం తగదని ఆయన స్పష్టంచేశారు. ‘భారత్-రష్యా బంధాల విషయానికొస్తే.. ఈ బంధం ఎన్నో కష్టాలను ఎదురొడ్డి నిలిచాయి’ అని చెప్పారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత రష్యాతో భారత్ బంధాల్లో ఏమైనా మార్పు ఉంటుందా? అని అడగ్గా.. ‘ఏ దేశంతో అయినా భారత్ బంధాలు వేటికవే విలువైనవి. వాటిని మరో దేశపు కోణం నుంచి చూడకూడదు. ఇక రష్యాతో మా బంధం కాలానికి ఎదురు నిలిచింది’ అని వివరించారు. అదే సమయంలో యూఎస్‌తో ఉన్న రక్షణ బంధాలను కూడా జైస్వాల్ ఎత్తిచూపారు. ఇటీవలి కాలంలో ఈ బంధాలు మరింత బలోపేతమయ్యాయని, ఈ భాగస్వామ్యం మరింత మెరుగయ్యేందుకు అవకాశం ఉందని చెప్పారు.
రక్షణ రంగంలో సంబంధాలు..
రష్యాతో ఎనర్జీ, రక్షణ రంగాల్లో భారత్ బంధాలపై ట్రంప్ చేసిన విమర్శలపై జైస్వాల్ పరోక్షంగా స్పందించారు. ‘రక్షణ రంగంలో మా కొనుగోళ్లన్నీ కూడా దేశ భద్రత, వ్యూహాత్మక అవసరాలను బట్టే ఉంటాయి. ఈ విషయంలో రష్యాతోనే కాదు, యూఎస్‌తో కూడా భారత్‌కు బలమైన సంబంధాలే ఉన్నాయి. గత కొన్నేళ్లలో యూఎస్-భారత్ రక్షణ బంధాలు మరింత బలంగా మారాయి. ఇండియా-యూఎస్ కాంపాక్ట్ డీల్‌తో ఈ సంబంధాలు మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంది’ అని జైస్వాల్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోడీ యూఎస్‌లో పర్యటించిన సమయంలో కాంపాక్ట్ (కాటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్టనర్‌షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ) ఒప్పందాన్ని ఈ రెండు దేశాలు చేసుకున్న సంగతి తెలిసిందే.






