- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India- Qatar: ఖతర్ కింగ్ తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలే లక్ష్యంగా చర్చ
ఖతర్, భారత్ మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామంగా మార్చాలనే నిర్ణయంపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చ జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఖతర్, భారత్ మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామంగా మార్చాలనే నిర్ణయంపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చ జరిగింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని నరేంద్ర మోడీ, ఖతర్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్- తనీ భేటీ జరిగింది. ఈ ఇద్దరు నాయకులు విస్తృతంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, ప్రాంతీయ అంశాలే లక్ష్యంగా భేటీ జరిగింది. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం గురించి ఇరుపక్షాలు చర్చించారు. అంతేకాకుండా, ఐదు సంవత్సరాలలోపు వాణిజ్యాన్ని 28 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరువులు నేతలు తెలిపారు.
ఇంధన భద్రతపై..
ఇంధన భద్రతను ఎలా విస్తృతం చేయాలనే దానిపై ఇరుదేశాలు దృష్టి సారించినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశాయి. సుంకాలు, రెట్టింపు పన్నులు, ఆర్థిక ఎగవేతను నివారించేందుకు ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాయి. ద్వైపాక్షిక చర్చలతో పాటు, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఖతర్ ఎమిర్ (Qatar Amir) షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-తని (Sheikh Tamim Bin Hamad Al Thani) రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా..మోడీ ఆయనకు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముతో ఖతర్ ఎమిర్ భేటీ అయ్యారు.






