- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాల్పుల విరమణపై ఇండియా పాక్ కీలక నిర్ణయాలు
కాల్పుల విరమణపై ఇండియా పాకిస్థాన్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. డీజీఎంవోల మధ్య ఈనెల 10న కుదిరిన అవగాహనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కాల్పుల విరమణపై ఇండియా పాకిస్థాన్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. డీజీఎంవోల మధ్య ఈనెల 10న కుదిరిన అవగాహనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి తరవాత భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రశిబిరాలపై మిస్సైల్ దాడి చేసింది.
దీంతో ఆ శిబిరాలు నేలమట్టం అవ్వడంతో పాటూ వంద మంది వరకు ఉగ్రవాదులు కన్నుమూశారు. భారత్ ఉగ్రవాదులపై దాడి చేసినప్పటికీ పాకిస్థాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సామాన్యులపైకి, ఇండియాలోని ఆర్మీ స్థావరాలపైకి దాడులు ప్రారంభించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. యుద్ధం వస్తుందా అన్న స్థాయిలోకి వెళ్లింది. చివరికి అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో రెండు దేశాలు చర్చించుకుని శాంతించాయి.ఈ నేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి.






