- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: పీఓకేను పాక్ ఖాళీ చేయాల్సిందే.. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
పీఓకేను పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనని ఈ విషయంలో భారత్ వైఖరి మారబోదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనని ఈ విషయంలో భారత్ వైఖరి మారబోదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadeer Jaiswal) స్పష్టం చేశారు. కశ్మీర్ సమస్య విషయంలో మూడో పక్షం అవసరం లేదని, భారత్ పాక్ లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసి ప్రెస్‌మీట్‌లో జైస్వాల్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) లో భాగంగా రెండు దేశాలు కాల్పుల విరమణ కుదుర్చుకున్నాయని, కానీ ఓటమి తర్వాత పాక్ విజయం సాధించానని చెప్పకుంటుందని ఇది ఆ దేశానికి అలవాటేనని విమర్శించారు. భారత్ దాడుల కారణంగా జరిగిన విధ్వంసం తర్వాతే పాక్ సీజ్ ఫైర్‌కు ముందుకు వచ్చిందన్నారు. చర్చల్లో అమెరికా పాత్ర ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. భారత్ ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, ఎటువంటి అణు బ్లాక్ మెయిల్‌లకు స్పందించబోదని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ కింద భారత సైన్యం తీసుకున్న చర్యలు పూర్తిగా సంప్రదాయ పరిధిలోనివని, అనేక విదేశీ దేశాలు కూడా పాకిస్తాన్‌ను ఖండించాయని తెలిపారు. భారత్‌కు ప్రతిస్పందించే హక్కు ఉన్నట్టు ధ్రువీకరించాయన్నారు. ఉగ్ర స్థావరాలపై మాత్రమే భారత్ దాడి చేసిందన్నారు. భారత సైన్యం సామర్థ్యాన్ని పాక్‌కు పూర్తిగా చూపించామన్నారు. పాక్ దాడిలో భారత ఆస్తులకు భారీ నష్టం కలిగిందని పాక్ చేస్తున్న ఆరోపణలను జైస్వాల్ తీవ్రంగా ఖండించారు. అలాంటి దేమీ జరగలేదని దాడులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను గమనించాలని సూచించారు.






