బోర్డర్‌లో సైన్యం తగ్గించడానికి సిద్ధం.. ఒక్కతూటా కూడా పేలకూడదు!

by Phanindra |

బోర్డర్‌లో సైన్యం తగ్గించడానికి భారత్, పాక్ ఒప్పుకున్నాయట. సరిహద్దుల్లో ఒక్కతూటా కూడా పేలకూడదని డీజీఎంవోల చర్చల్లో నిర్ణయించారట.

బోర్డర్‌లో సైన్యం తగ్గించడానికి సిద్ధం.. ఒక్కతూటా కూడా పేలకూడదు!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరుదేశాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) చర్చలు జరిగాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ చర్చల్లో సరిహద్దుల వద్ద కాల్పులు, మిలటరీ చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని రెండు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకదానిపై మరొక దేశం ఒక్క తూటా పేల్చడం కానీ, దురాక్రమణలకు పాల్పడటం కానీ చెయ్యకూడదని డీజీఎంవోలు చర్చల్లో నిర్ణయం తీసుకున్నారట.

అలాగే సరిహద్దుల వద్ద భారీగా మోహరించిన సైన్యాన్ని కూడా నెమ్మదిగా వెనక్కు మళ్లించేందుకు ఇరుదేశాలు ఒప్పుకున్నట్లు సమాచారం. హాట్‌లైన్‌ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఈ చర్చలు వాయిదా పడి, సాయంత్రం 5 గంటలకు జరిగాయి. సరిహద్దుల్లో తిరిగి శాంతిభద్రతలు నెలకొల్పడంపై ఇరుదేశాల డీజీఎంవోలు చర్చలు జరిపినట్లు సమాచారం.

Next Story