- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salal Dam: రియాసిలోని సలాల్ డ్యామ్ మూడు గేట్లను తెరిచిన అధికారులు
పరిస్థితికి అప్రమత్తమైన అధికారులు చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్, సలాల్ డ్యామ్ గేట్లను ఎత్తేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కవ్వింపు దాడులకు పాల్పడుతోంది. దీనికి భారత సైన్యం గట్టిగానే బదులిస్తోంది. సరిహద్దుల్లో మన సైనిక స్థావరాలపై పాక్ చేస్తున్న దాడులకు బదులుగా భారత్ లాహోర్‌లోని డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. పెహల్గాం దాడులకు ప్రతిస్పందనగా ఇటీవల భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇందులో భాగంగానే పలు డ్యామ్‌లను మూసేసింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భారీ వర్షం కురియడంతో ఆ ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. పరిస్థితికి అప్రమత్తమైన అధికారులు చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్, సలాల్ డ్యామ్ గేట్లను ఎత్తేశారు. పెరుగుతున్న నీటి మట్టాలను నియంత్రించడానికి భారత అధికారులు రియాసిలోని సలాల్ డ్యామ్‌కు చెందిన మూడు గేట్లను తెరిచి పాకిస్తాన్‌కు నీటిని విడుదల చేశారు. భారీ వర్షాలకు రాంబన్ జిల్లా మొత్తం వాహనాల రాకపోకలు కూడా ఆగిపోయాయి. పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లకుండా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్, సలాల్ డ్యామ్ గేట్లను మూసేశారు. తాజాగా భారీ వర్షాలకు నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తివేశారు.






