- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‍కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరం.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల వెనుక మర్మం అదేనా?
బ్యాంక్ యూనియన్‍లు ఫైర్ అయిన గంటల్లోనే నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన బ్యాక్ టు బ్యాక్ కామెంట్స్ ఫైనాన్సియల్ సెక్టార్‍లో హాట్ టాపిక్‍గా మారాయి. నిన్న బ్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ చేసిన బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యాఖ్యలపై బ్యాంక్ యూనియర్లు ఫైర్ అయిన గంటల వ్యవధిలోనే కేంద్ర మంత్రి మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గురవారం ఎస్‍బీఐ 12వ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్స్ కాంక్లేవ్ 2025లో (SBI Banking and Economics Conclave 2025) నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి మన దేశానికి పెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరం అని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ విషయంలో ఇప్పటికే పని పని ప్రారంభమైందని వెల్లడించారు. ఆర్‍బీఐ, బ్యాంకులతో మేము చర్చలు కూడా జరుపుతున్నామని తెలిపారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏకీకృతం చేయడానికి వాటిని సంస్కరించడానికి ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిర్మలా వ్యాఖ్యలపై బ్యాంక్ యూనియర్ల ఫైర్:
నిన్న బ్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం (Bnk privatization) వల్ల ఆర్థిక సంఘటితానికి, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనలు సరికాదని అన్నారు. 1969లో జరిగిన బ్యాంకుల జాతీయీకరణ వల్ల అనుకున్న ఫలితాలు రాలేదని చెప్పారు. బ్యాంకుల నేషనలైజేషన్ జరిగిన 50 ఏళ్ల తర్వాత కూడా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయాయి. బ్యాంకుల జాతీయీకరణ వల్ల ప్రాధాన్యతా రంగాలకు ప్రభుత్వ పథకాలకు సహాయం చేయగలిగాం. కానీ ఆయా ప్రభుత్వ బ్యాంకులు ప్రొఫెషనల్‍గా ఉండలేకపోయాయి. ప్రైవేటీకరణ వల్ల బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్లలేమన్న అభిప్రాయం తప్పు అని చెప్పారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశంపై నిర్మలా సీతారామన్ చేసిన ఈ వ్యాఖ్యలను బ్యాంకు యూనియర్లు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఇవాళ ఉదయమే 9 ట్రేడ్ యూనిట్లతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటనలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. దేశానికి ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంతో సేవ చేస్తున్నాయని అలాంటి బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశాలు మానుకోవాలని హితవుపలికారు. మూలధన సాయం అందించి బ్యాంకులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యతా రంగాలకు, ప్రభుత్వ పథకాలు ఈ బ్యాంకుల ద్వారానే అందుతున్నాయని గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత ప్రభుత్వ బ్యాంకులతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్‍ధన్ యోజన కింద 90 శాతం ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే తెరుచుకున్నాయని యూఎఫ్‍బీయూ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే జాతి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. అయితే యూఎఫ్‍బీయూ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మరో కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్ భారత దేశానికి పెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకు అవసరం అని చెప్పడం రాజకీయ, ఆర్థిక రంగాల్లో హాట్ టాపిక్‍గా మారింది. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ దిశగా కేంద్రం కీలక అడుగులు ముందుకు వేస్తోంది.






