పాలస్తీనా సమస్యపై భారతదేశం నాయకత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది: సోనియా గాంధీ

by Malleboina Mahesh |

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య గత కొంత కాలంగా తీవ్ర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనాపై నిత్యం మెరుపు దాడి చేస్తుంది.

పాలస్తీనా సమస్యపై భారతదేశం నాయకత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది: సోనియా గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్- పాలస్తీనా (Israel-Palestine) మధ్య గత కొంత కాలంగా తీవ్ర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనాపై నిత్యం మెరుపు దాడి చేస్తుంది. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇరు ప్రాంతాల మధ్య జరుగుతున్న ఈ దాడులపై అనేక దేశాలు స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) పాలస్తీనా సమస్య (Palestinian issue)ను హైలెట్ చేస్తూ.. పాలస్తీనా భారతదేశం నాయకత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ మోడీ ప్రభుత్వ వైఖరి మాత్రం "తీవ్రమైన నిశ్శబ్దం"గా, మానవత్వం, నైతికత రెండింటినీ త్యజించినట్లుగా ఉందని ఆమె విమర్శించారు.

ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi), ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం పై ఆధారపడి ఉన్నాయని, రాజ్యాంగ విలువలు, వ్యూహాత్మక ప్రయోజనాలు పక్కనబెట్టబడ్డాయని ఆమె ఆరోపించారు. సోనియా గాంధీ (Sonia Gandhi) అభిప్రాయం ప్రకారం, వ్యక్తిగతీకరించిన దౌత్యం ఎప్పటికీ స్థిరంగా ఉండదని, భారతదేశ విదేశాంగ విధానానికి ఇది మార్గదర్శకంగా ఉండకూడదని ఆమె హెచ్చరించారు. ప్రపంచంలోని ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఇటువంటి ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయని, అంతేకాక అవమానకరమైన పరిణామాలకు దారి తీసాయని ఓ ప్రముఖ పత్రికలో ప్రచురించిన తన వ్యాసంలో సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

Next Story