- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గించే యోచనలో భారత్..!
అమెరికా వాసులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తాం, భారత్ తో పాటు పలు దేశాలపై సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై భారత్ అలెర్ట్ అయ్యింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా వాసులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తాం, భారత్ తో పాటు పలు దేశాలపై సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై భారత్ అలెర్ట్ అయ్యింది. ట్రంప్ హెచ్చరికలతో సుంకాల వ్యవహారంపై భారత్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై సుంకాన్ని కాస్త తగ్గించే యోచన చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, ఖరీదైన మోటర్ సైకిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల పై విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలు కన్పిస్తున్నాయి. లాంటి నిర్ణయం వల్ల దేశంలోని పరిశ్రమలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు ఈ విషయంలో ఓ స్పష్టతవస్తుందని భావిస్తున్నారు. వాస్తవానికి భారత్.. అమెరికా నుంచి కేవలం 20 రకాల వస్తువులనే దిగుమతి చేసుకుంటుంది. వాటిపైనే వందశాతం కంటే ఎక్కువగా సుంకాలు వసూలు చేస్తోంది. అయితే, ఆ సుంకాలనే తగ్గించే అవకాశం కన్పిస్తుంది.
బ్రిక్స్ దేశాలే టార్గెట్ గా..
బ్రిక్స్ దేశాలపై మొదటి నుంచి ట్రంప్ గుర్రుగానే ఉన్నారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ దేశాలను టార్గెట్ చేస్తూ భారత్ తోపాటు, చైనా, బ్రెజిల్ పై భారీగా సుంకాలు భారం తప్పదని హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది. ఈ దేశాలు విపరీతంగా టారిఫ్ లు విధిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు అమెరికాను నెంబర్ వన్ గా చేసేందుకు అమెరికాకు నష్టం చేసే దేశాలపైనా, వ్యక్తులపైన భారీగా సుంకాలు విధించాలని భావిస్తున్నట్లు రిపబ్లికన్ ల సమావేశంలో సోమవారం ట్రంప్ చేప్పారు. ప్రధానంగా చైనా టారిఫ్ రూపంలో పెద్దఎత్తున డబ్బు దండుకుంటోందని పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్ సహా ఇతర దేశాల గురించి ప్రస్తావించారు. కాగా.. ఈ హెచ్చరికలపైనే భారత్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది






