- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ మాపై దాడులు చేసి రెచ్చగొట్టాలని చూసింది: ఆసిమ్ మునీర్
మరోసారి భారత్‌పై అబద్ధపు ఆరోపణలు చేశారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.భారత్ తమపై దాడులు చేసి రెచ్చగొట్టాలని చూసిందని చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత్ రెండుసార్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు పాక్‌పై దాడులు చేసిందని, భవిష్యత్తు గురించి భారత్‌కు ఏమాత్రం ఆలోచనలేదని, ఇది చాలా విచారకరమని మునీర్ అన్నారు. కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో ప్రసంగించిన మునీర్.. ‘దక్షిణాసియాలో శాంతికి పాకిస్తాన్ కీలకం. ఈ దేశంపై భారత్ అనవసరంగా దాడులు చేసింది. వాటిని మేం ఈ దాడులకు ఘాటుగా బదులిచ్చాం. ఇలా రెచ్చగొట్టినా పరిణితితో హద్దు మీరకుండా దాడులను తిప్పికొట్టాం. తద్వారా మేం శాంతికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని మరోసారి రుజువుచేశాం’ అని చెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడంలో పాక్ దాదాపు సక్సెస్ అయిందని, అలాంటి సమయంలో భారత్ అనవసరంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టిస్తోందని మునీర్ ఆరోపించారు.
మరోసారి కశ్మీర్ అంశం..
ఈ ప్రసంగంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని మునీర్ లేవనెత్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్రమంగా భారత్ చేసిన ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతూ కశ్మీరీ సోదరులు చేస్తున్న త్యాగాలను గుర్తుచేసుకోవాలని పాక్ ఆర్మీ చీఫ్ అన్నారు. కశ్మీర్ సమస్యను న్యాయపరంగా తీర్చాలని పాకిస్తాన్ బలంగా వాదిస్తోందని, యూఎన్ ప్రతిపాదనలతోపాటు కశ్మీరీ ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా ఈ సమస్యను తీర్చాలని వాదించారు. కాగా, పహెల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని రోజుల ముందు కూడా మునీర్ ఇలాగే కశ్మీర అంశం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.






