- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaishankar: భారత్ బోధకుల కోసం కాదు, భాగస్వాముల కోసం చూస్తోంది: జైశంకర్
భారత్‌తో యూరప్‌కు సన్నిహిత సంబంధాలు కావాలనుకుంటే, స్నేహభావం, పరస్పర ఆసక్తి ఉండాలన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యూరప్ దేశాల అధినేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌కు 'బోధించే'వారు అక్కరలేదని, భాగస్వామ్యం కావాలనుకునే వారికోసం చూస్తోందని అన్నారు. భారత్‌తో యూరప్‌కు సన్నిహిత సంబంధాలు కావాలనుకుంటే, స్నేహభావం, పరస్పర ఆసక్తి ఉండాలన్నారు. ప్రపంచ దేశాల నుంచి భాగస్వామ్యం కోసం భారత్ చూస్తోందని, బోధకుల కోసం కాదన్నారు. ముఖ్యంగా సొంత దేశంలో పాటించకుండా బయటివారికి మాత్రమే బోధిస్తున్నారని జైశంకర్ తెలిపారు. యూరప్‌లోని అనేక దేశాలు ఎప్పటినుంచో ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మారిపోయాయి. యూరప్‌తో తమకు సుమారు నాలుగు దశాబ్దాల స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితమే యూరప్‌తో కొన్ని ఒప్పందాలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పశ్చిమ దేశాల తీరును జైశంకర్ విమర్శించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నివారించేందుకు రష్యా ప్రమేయం లేకుండా చేసిన ప్రయత్నాలను తప్పుబట్టారు. అటువంటి ప్రయత్నాలు ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.






