- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India-Japan: భారత్‌కు జపాన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇక రైల్వే ట్రాక్ హీటెక్కాల్సిందే!
కేంద్ర ప్రభుత్వం (Central Government) బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ (Bullet Train Project)ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం (Central Government) బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ (Bullet Train Project)ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ముంబై (Mumbai) - అహ్మదాబాద్ (Ahmedabad) హైస్పీడ్ రైల్ కారిడార్ శరవేగంగా రూపుదిద్దుకుటోంది. ఒకవేళ ఆ ట్రాక్ పూర్తయితే దేశంలో ముంబై - అహ్మదాబాద్ రూట్ తొలి హైస్పీడ్ రైల్వే కారిడార్‌గా నిలవనుంది. అయితే, ఆ ట్రాక్‌పై ట్రైన్ గరిష్ట వేగం గంటకు 320 కి.మీగా ఉండనుంది. బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై–అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయిన వెంటనే హై టెంపరేచర్, డ్రైవింగ్ పరిస్థితులపై సమాచారాన్ని సేకరించేందుకు బుల్లెట్ ట్రైన్లను ట్రయల్ రన్ (Trial Run) చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఇండియా (India)తో జపాన్ (Japan)కు ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో ఆ దేశం ఇండియాకు రెండు బుల్లెట్ ట్రైన్లను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చేలా మిత్ర దేశం జపాన్ (Japan) ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. గంటకు ఏకంగా 320 కి.మీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకన్ సెన్ E5, E3 (Shinkansen E5, E3) సిరీస్ బుల్లెట్ ట్రైన్లు త్వరలోనే భారత్‌కు రానున్నాయి. అయితే, ట్రైన్లనే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌పై ట్రయల్ రన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కానీ, అధికారికంగా బుల్లెట్ ట్రైన్లు 2026లో ప్రయాణికుల అందుబాటులోకి వస్తాయని ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ (NHSRC) ఇప్పటికే ప్రకటించింది.






