- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో వాటర్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఐఐటీ మద్రాస్‌లో సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నట్టు భారత్, ఇజ్రాయెల్ మంగళవారం సంయుక్తంగా ప్రకటించాయి. ఈ మేరకు త్రైపాక్షిక ఒప్పందంపై ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, ఐఐటీ మద్రాస్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అమృత్ మిషన్ సంతకాలు చేశాయి. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్.. ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉంది. తాజా ఒప్పందం ద్వారా భారత్‌లో నీటి నిర్వహణలో ఉన్న క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ నీటి సాంకేతికతలలో ఆవిష్కరణలు, పరిశోధనలు, సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యేకించి పట్టణ నీటి సరఫరాలో ఇబ్బందులను తొలగించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.