- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది: కేంద్ర ప్రభుత్వం
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ జీడీపీ వృద్ధి అంచనాలపై వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికను వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే భారత్ జీడీపీ వృద్ధి అంచనాలపై వరల్డ్ బ్యాంక్ (World Bank) విడుదల చేసిన నివేదికను వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొంది. 2025-26లో భారత వృద్ధి రేటు 6.7గా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి 2.7 శాతంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో భారత్ విశేషమైన పనితీరు కనపర్చడం గమనార్హం. సేవారంగంలో నిరంతర విస్తరణ, తయారీ రంగం బలోపేతం కావడం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికి ప్రభుత్వ చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని కేంద్రం తెలిపింది. మరోవైపు భారతదేశ వృద్ధి 2025, 2026లో 6.5శాతం వద్ద పటిష్టంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.






