ఉపరాష్ట్రపతి పోరుకు ‘ఇండియా’ రెడీ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు

by B.Srinivas |   (  Updated:2025-08-10 14:30:22  IST  )

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అనంతరం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఉపరాష్ట్రపతి పోరుకు ‘ఇండియా’ రెడీ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అనంతరం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి (India alliance) పార్టీలు ఇప్పటి వరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పలువురు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. విజయం సాధించడానికి తగినంత మెజారిటీ లేకపోయినప్పటికీ బలమైన రాజకీయ సందేశాన్ని పంపాలనే ఉద్దేశంతో పోటీ నుంచి వెనక్కి తగ్గకూదదని ఇండియా కూటమి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరగకపోయినప్పటికీ ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి ఖర్గే ప్రతిపక్ష పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

బీజేపీ అభ్యర్థిని ప్రకటించాకే నిర్ణయం!

ఉపరాష్ట్రపతి బరిలో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తదుపడి డిసిషన్ తీసుకోవాలని ఇండియా కూటమిలోని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇటీవల ఇండియా నేతలు సమావేశమవడం, బిహార్ లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యత పెరుగుతోంది. దీనిని వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఇటీవల ఇండియా కూటమి నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకించడానికి నాయకులంతా తమ నిబద్ధతను నొక్కి చెప్పారు.

త్వరలోనే ఎన్డీయే అభ్యర్థి ఖరారు !

ఎన్డీయే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మంగళవారం లేదా బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాలు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి వివాదాలు లేని, పార్లమెంటరీ వ్యవహారాల్లో గణనీయమైన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘రాజ్యాంగంలోని రెండో అత్యున్నత పదవికి నామినేట్ చేయబడిన అభ్యర్థికి పార్లమెంటరీ విధానం, నియమాలపై లోతైన అవగాహన ఉండటం చాలా అవసరం. రాజ్యసభను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది ఎంతో ముఖ్యం’ అని బీజేపీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు ఒకరు తెలిపారు.

Next Story