ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది: జర్మనీ

by Phanindra |

ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. పహెల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించారు కూడా.

ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది: జర్మనీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడిని జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్ ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను రక్షించునే హక్కు భారత్‌కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కలిసి బెర్లిన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జోహన్ వాడెఫుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉన్న కాల్పుల విరమణను కొనసాగించాలని, ఇతర సమస్యలను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ‘ఇరుదేశాల మధ్య మిలటరీ దాడులు జరిగాయి. కానీ ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంటుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఒప్పందం ఉంది. దాన్ని మేం సమర్థిస్తాం’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను జైశంకర్ స్వాగతించారు.

Next Story