- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాడి చేసేందుకు భారత్‌కు పూర్తి హక్కు ఉంది: ఇజ్రాయెల్ మద్ధతు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టింది. అర్థరాత్రి 1:44 గంటలకు పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ చర్యతో పాక్ వెన్నులో వణుకు పుట్టించింది భారత్. ఈ క్రమంలోనే భారత్ 'ఆపరేషన్ సింధూర్'కు ఇజ్రాయెల్ (Isreal) పూర్తి మద్ధతు తెలిపింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేయడాన్ని సమర్థించింది. ఇండియాకు ఆత్మరక్షణ హక్కు ఉందని ఇజ్రాయెల్ అంబాసిడర్ ర్యూవెన్ అజర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అమాయకులపై దాడికి పాల్పడే ఉగ్రవాదులకు జీవించే హక్కు లేదని పేర్కొన్నారు. #OperationSindoor అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు.
కాగా, ఇప్పటికే ‘ఆపరేషన్ సింధూర్’పై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio).. ఉగ్రవాదులపై చర్య తీసుకుని హక్కు భారత్‌కు ఉందని తెలిపారు. దీనికి కౌంటర్‌గా పాక్ ఎలాంటి చర్యల తీసుకొవద్దని సూచించారు. భారత్‌పై యుద్ధానికి ధైర్యం చేయవద్దని సలహా ఇచ్చారు. అదేవిధంగా పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులను భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా దేశాలకు వివరించింది.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






