చీనాబ్ నదిపై మరో భారీ ప్రాజెక్టుకు భారత్ గ్రీన్‌సిగ్నల్

by Phanindra |

చీనాబ్ నదిపై మరో భారీ ప్రాజెక్టుకు భారత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 260 మెగావాట్ల హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది.

చీనాబ్ నదిపై మరో భారీ ప్రాజెక్టుకు భారత్ గ్రీన్‌సిగ్నల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. ఆ నీటిని పూర్తిగా దేశీయ వినియోగం కోసం ఉపయోగించుకుంటామని పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కిష్తవర్‌లో చీనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజ్-2 హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్యానెల్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో భారత హైడ్రోపవర్ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అంతకుముందు జులై నెలలో ఇదే నదిపై 1856 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సవాల్‌కోటే హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు కోసం నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అంతర్జాతీయ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు సింధూ జలాల ఒప్పందం వల్ల సింధూ నది, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణం భారత్‌కు సమస్యాత్మకంగా ఉండేది. అయితే ఈ ఒప్పందాన్ని పహెల్గాం దాడి తర్వాత ఈ ఒప్పందాన్ని తాము నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అప్పటి నుంచి ఈ నీటిని ఉపయోగించుకునే విషయంలో భారత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, ఇలాంటి నిర్ణయాలతో భారత్ తమపై ‘నీటి యుద్ధం’ చేస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది.

Next Story