మోదీ ఈ దేశంలో పుట్టడం భారతీయులు చేసుకున్న అదృష్టం : పుతిన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-04 23:26:35  IST  )

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టడం, ఇక్కడ జీవించడం, ఊపిరి తీసుకోవడం..

మోదీ ఈ దేశంలో పుట్టడం భారతీయులు చేసుకున్న అదృష్టం : పుతిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టడం, ఇక్కడ జీవించడం, ఊపిరి తీసుకోవడం భారతీయులు చేసుకున్న అదృష్టమని రష్యా అధ్యక్షుడు పుతిన్ కితాబిచ్చారు. భారతదేశంలో పర్యటన సందర్భంగా ఇక్కడి నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీకి తన బాధ్యతల పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రశంసించారు. భారత్ తో తమకు ఎంతో నమ్మకమైన, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయన్నారు. మోదీ చాలా నమ్మకమైన వ్యక్తి అని, ఎంతో నిజాయితీగా ఉంటారని ప్రశంసించారు.

ప్రధాని నరేంద్రమోదీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థిక సహకారం, రక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాలకు ఆయన కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మాస్కో పర్యటనకు వెళ్లిన విషయాలను గుర్తు చేసుకున్నారు. మాస్కో పర్యటనలో మోదీ ఎంతో సాదాసీదాగా వ్యవహరించారని, ఇరుదేశాల మధ్య పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై టీ తాగుతూ చాలా నార్మల్ గా చర్చించుకున్నామని చెప్పుకొచ్చారు. తమ మధ్య జరిగిన ఆ ఆసక్తికరమైన సంభాషణను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి రష్యా ఎప్పుడూ మద్దతిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు.

Next Story