- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం.. త్వరలోనే అగ్రిమెంట్ కుదిరే చాన్స్ !
చాలా నెలల విరామం తర్వాత భారత్, బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: చాలా నెలల విరామం తర్వాత భారత్, బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ (Jonathan Reynolds) తో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush goyal) సోమవారం బేటీ అయ్యారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే మెగా ఒప్పందంపై చర్చలు జరిగాయి. దీనిపై త్వరలోనే అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా రెండు దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని మూడు రెట్లు పెంచడమే ఈ డీల్ లక్ష్యం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వార్షికంగా 20 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. సమావేశం అనంతరం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘పరస్పర వృద్ధికి వీలు కల్పించే రెండు ఆర్థిక వ్యవస్థల బలాన్ని పెంచే పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం వైపు చర్చలను పునఃప్రారంభించడానికి ఇరువైపులా అంగీకరించాం’ అని పేర్కొన్నారు.
అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముందుకు సాగడానికి మార్గమం సుగమం అయిందని తెలిపారు. ఈ ఒప్పందాలు దీర్ఘకాలిక భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జరుగుతాయి కాబట్టి మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. అలాగే ఈ ఒప్పందం బ్రిటన్‌కు అత్యంత కీలకమైందని అని రేనాల్డ్స్ అన్నారు. వలసల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల్లో వలసలపై ఎప్పుడూ చర్చించలేదని. వాణిజ్యం, వలసలు పెరగడం రెండు వేర్వేరు సమస్యలు అని చెప్పారు.






