- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chenab Water: పాకిస్థాన్ పై భారత్ జలఖడ్గం.. చీనాబ్ నీళ్లు బంద్
చీనాబ్ నది (Chenab River) పై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట ద్వారా భారత్.. పాక్ కు నీటిని నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనితో పాటు జీలం నదిపై ఉన్న కిషన్ గంగా రిజర్వాయర్ ద్వారా కూడా పాక్ కు నీటిని నిలిపివేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ సింధూ నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. తాజాగా చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం గేట్లను కూడా అధికారులు మూసివేశారు. దీంతో చుక్క నీరైన పారక నదీ పరివాహక ప్రాంతం వెలవెలబోతోంది. పాక్ పై ఆయుధాలతో యుద్ధం చేయకుండానే.. భారత్ జలయుద్ధం చేస్తుందనడంలో సందేహం లేదు.
చీనాబ్ నది (Chenab River) పై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట (Baglihar Dam) ద్వారా భారత్.. పాక్ కు నీటిని నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనితో పాటు జీలం నదిపై ఉన్న కిషన్ గంగా రిజర్వాయర్ ద్వారా కూడా పాక్ కు నీటిని నిలిపివేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జలఖడ్గంతో పాక్ పని పడుతున్న భారత్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక ఆ దేశ మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. అణుదాడి చేస్తామని, పాకిస్థాన్ కు ప్రవహించే నదులపై ఇండియా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల హెచ్చరించారు.
గురేజ్ లోయలోని (Gurez Valley) వాయువ్య హిమాలయాలలో ఉన్న మొట్టమొదటి మెగా జలవిద్యుత్ ప్లాంట్ (Mega Hydro Power Plant) అయిన కిషన్‌గంగా ఆనకట్ట (Kishan Ganga Dam) పై అతి త్వరలో నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. దాని నుండి దిగువకు ప్రవహించే నీటి ప్రవాహమంతా నిలిపివేయబడుతుంది. ఈ రెండు ఆనకట్టల డిజైన్లపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.






