China: మోడీ, జిన్ పింగ్ భేటీ తర్వాతే సంబంధాలు మెరుగయ్యాయి- చైనా

by Shamantha N |

భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య జరిగిన భేటీ తర్వాతే ఇరుదేశాల సంబంధాలు మెరుగయ్యాయని బీజింగ్ దౌత్యవేత్త షు ఫిహంగ్ అన్నారు.

China: మోడీ, జిన్ పింగ్ భేటీ తర్వాతే సంబంధాలు మెరుగయ్యాయి- చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య జరిగిన భేటీ తర్వాతే ఇరుదేశాల సంబంధాలు మెరుగయ్యాయని బీజింగ్ దౌత్యవేత్త షు ఫిహంగ్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా మంత్రి వాంగ్ యూ మధ్య భేటీ తర్వాత ఫిహంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీ20 సహా ఇతర కీలక వేదికలపై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పేర్కొన్నారు. ఫిహంగ్ మాట్లాడుతూ.. ‘‘అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రధాని మోడీ గతేడాది కజాన్‌లో భేటీ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఇరు పక్షాలు జరిపిన చర్చల్లో అంగీకారానికి వచ్చిన అంశాలను బలంగా అమలు చేస్తున్నాయి. వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరుగుతున్నాయి. చాలా అంశాల్లో పరస్పర అవగాహనకు వచ్చాం’’ అని అన్నారు. మూడో ఇండో-చైనా యూత్‌ డైలాగ్‌ వద్ద ఫిహంగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎస్ఈవోకు చైనా ఆతిథ్యం

మరోవైపు, ఈ ఏడాది చివర్లో చైనా షాంఘై సహకార సంస్థ (SCO) చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆశిస్తున్నట్లు ఫిహంగ్ అన్నారు. అంతేకాకుండా యూరేషియన్‌ బ్లాక్‌లో భారత్‌ పాత్రను ప్రశంసించారు. న్యూఢిల్లీతో కలిసి పనిచేయడానికి బీజింగ్‌ సిద్ధంగా ఉందన్నారు. ఇకపోతే, జైశంకర్‌, వాంగ్‌యీ భేటీ తర్వాత సరిహద్దుల్లో శాంతి గురించి కీలక నిర్ణయానికి వచ్చారు. పరస్పర విశ్వాసం పెంపొందించుకొనే చర్యలు చేపట్టాలని, సంయుక్తంగా సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని నిర్ణయించారు. కాగా..2020 గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఎల్ఏసీ వెంబడి ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత గతేడాది జూన్ లో మోడీ, జిన్ పింగ్ మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాతే ఇరుదేశాల సంబంధాలు కొంత మెరుగయ్యాయి.

Next Story