- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ దురాక్రమణ వల్లనే పీవోకే అల్లర్లు.. దాయాది దేశపై భారత్ విమర్శలు
పాక్ దురాక్రమణ వల్లనే పీవోకే అల్లర్లు జరుగుతున్నాయని భారత్ విమర్శలు చేసింది. ఇక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్‌ను నిలదీయాలని కోరింది.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కొన్ని రోజులుగా చెలరేగుతున్న అల్లర్లకు పాక్ ప్రభుత్వమే కారణమని భారత్ మండిపడింది. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 12 మంది మరణించగా.. 150 మందికిపైగా గాయపడ్డారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్తాన్ అణచివేత, ఆక్రమణ వల్లనే ఈ అల్లర్లు చెలరేగుతున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. ‘పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో నిరసనల గురించి విన్నాం. ఈ ఆందోళనల్లో స్థానిక ప్రజలపై పాక్ దళాలు క్రూరంగా దాడులు చేసిన విషయం కూడా మా దృష్టికి వచ్చింది’ అని జైస్వాల్ తెలిపారు.
ఈ క్రమంలోనే పీవోకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాక్‌ను నిలదీయాలని ప్రపంచ దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని సంపదను దోచుకెళ్లడం, అణచివేత వల్లనే పీవోకేలో అల్లర్లు చెలరేగుతున్నాయని, ఈ నిరసనలను అణచివేసే క్రమంలో పాక్ దళాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని భారత్ ఆరోపించింది.






