India-Belgium: బెల్జియం ప్రతినిధులతో జైశంకర్ భేటీ.. వాణిజ్యం, పెట్టుబడులపై డిస్కషన్

by B.Srinivas |

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బెల్జియం మంత్రి మాక్సిమ్ ప్రీవోట్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించారు.

India-Belgium: బెల్జియం ప్రతినిధులతో జైశంకర్ భేటీ.. వాణిజ్యం, పెట్టుబడులపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) సోమవారం బెల్జియం మంత్రి మాక్సిమ్ ప్రీవోట్‌ (Maxim preevote)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం (Trade), పెట్టుబడి (Investment), రక్షణ (Defence), సెమీకండక్టర్లు (Semiconductors) డిజిటలైజేషన్‌లో సహకారాన్ని బలోపేతం చేసుకునే మార్గాలపై ఇరువురు చర్చించారు. అలాగే యూరోపియన్ యూనియన్ (EU), బహుళ వేదికలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పరిణామాలపైనా డిస్కస్ చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై కూడా తాను ప్రీవోట్‌తో సమగ్రంగా చర్చించానని జైశంకర్ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా' కోసం కొత్త అవకాశాలపైనా డిస్కస్ చేశానని పేర్కొన్నారు.

అనంతరం ప్రివోట్ ఈ భేటీపై స్పందిస్తూ.. రెండు దేశాలు బలమైన స్నేహాన్ని పంచుకుంటున్నాయని నొక్కి చెప్పారు. ఈ సంబంధాలు బెల్జియంలో శక్తివంతమైన భారతీయ సమాజం, భద్రత, వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణల వరకు ప్రపంచ సవాళ్లను పరిష్కరించాలనే లక్ష్యంతో ఉందని తెలిపారు. వేగంగా మారుతున్న ప్రపంచ క్రమంలో బెల్జియం, భారత్‌లు తమ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ (Astrid) నేతృత్వంలోని 70 మందితో కూడిన బృందం ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. మార్చి 8 వరకు వారి టూర్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.

Next Story