BIG BREAKING: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత ఆర్మీ కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-18 04:19:08  IST  )

భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా దౌత్యంతో ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ నేటితో ముగుస్తున్న వేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది.

BIG BREAKING: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత ఆర్మీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా దౌత్యంతో ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ నేటితో ముగుస్తుందన్న వార్తలు వస్తున్న వేళ భారత ఆర్మీ (Indian Army) కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు (Cease Fire) గడువు లేదన్న ఆర్మీ.. ఇకపై కూడా కాల్పుల విరమణ కొనసాగుతుందని వెల్లడించింది. అలాగే నేడు ఇండియా, పాక్ డీజీఎంఓ (GDMO) చర్చలు కూడా జరగటం లేదని తెలిపింది. ఈనెల 12న ఇరుదేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.

మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో.. సైన్యం సరిహద్దు వెంబడి భారీ బందోబస్త్ ఏర్పాటు చేసింది. కాల్పుల విరమణ ముగియనున్న వేళ పాక్ సైన్యం సైనిక చర్యకు దిగితే ప్రతిచర్య చేపట్టేందుకు భారత త్రివిధ దళాలు (Tri Armed Foreces) సిద్ధంగా ఉన్నాయి. మరోసారి పాక్ కవ్వింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని ఇప్పటికే భారత ప్రభుత్వం హెచ్చరించింది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ నేవీ (Indian Navy), ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ (Air Force) కలిసి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఆ తర్వాత పాక్ సైన్యం సరిహద్దు నగరాలపై కాల్పులు జరపగా ఆర్మీ జవాన్లు, సివిలియన్లు మరణించారు. పాక్ సైన్యం కాల్పుల్ని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. వరుసగా 12 రోజులపాటు కాల్పులకు పాల్పడిన పాక్ తో యుద్ధం అనివార్యమయింది. ఈ క్రమంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చింది. ఆ వెంటనే పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించగా భారత్ సీరియస్ అయింది. మళ్లీ రిపీట్ అయితే ఊరుకోబోమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) హెచ్చరించారు.

Next Story