- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 24న ట్రేడ్ డీల్‌పై సంతకాలు.. మోడీతోపాటు యూకేకు పీయూష్ గోయల్
జులై 24న యూకే, భారత్ ట్రేడ్ డీల్‌పై సంతకాలు చేసుకోనున్నాయి. దీనికోసం ప్రధాని మోడీతోపాటు పీయూష్ గోయల్ కూడా యూకేకు వెళ్లనున్నారట.

దిశ, నేషనల్ బ్యూరో: యూకేతో భారత్ చేసుకున్న ఒప్పందంపై ఈ నెల 24వ తేదీన ఇరుదేశాలు సంతకాలు చేయనున్నారు. దీని కోసం ప్రధాని మోడీతోపాటు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా యూకే వెళ్తారని అధికారులు చెప్తున్నారు. ఈ రెండు దేశాలు మే 6న వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగిశాయని, త్వరలోనే ఒప్పందంపై సంతకాలు చేసుకుంటామని ప్రకటించాయి. ఈ డీల్‌తో భారత్ నుంచి బ్రిటన్‌కు వెళ్లే లెదర్, ఫుట్‌వేర్, దుస్తుల వంటి ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలు తగ్గుతాయి.
అలాగే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చే విస్కీ, కార్ల ధరలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. 2030 నాటికి ఈ రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని 120 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, బుధవారం నుంచి ప్రధాని మోడీ నాలుగు రోజుల పాటు యూకే, మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమయంలోనే యూకే ట్రేడ్ డీల్‌పై సంతకాలు జరుగుతాయని తెలుస్తోంది.






